సూళ్లూరుపేటలో స్థానిక ఎన్నికలకు ఆమ్ ఆద్మీ పార్టీ సిద్ధం

సూళ్లూరుపేట:సత్య వెలుగు న్యూస్: ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సూళ్లూరుపేట నియోజకవర్గం నుంచి అన్ని స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) పోటీ చేస్తుందని తిరుపతి జిల్లా అధ్యక్షుడు నీరుగట్టు నగేష్ తెలిపారు. నాయుడుపేటలో నియోజకవర్గ కన్వీనర్ పట్టపు రవి అధ్యక్షతన జరిగిన నియోజకవర్గ స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, కౌన్సిలర్, మున్సిపల్ చైర్మన్ స్థానాలకు పార్టీ తరఫున అభ్యర్థులను నిలబెడతామని వెల్లడించారు. ప్రజాసేవ చేయాలనే ఆసక్తి ఉన్న సామాజికవేత్తలు, మేధావులు, రిటైర్డ్ ఉద్యోగులు, యువత, మహిళలు,...