కడపలో ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర సర్వసభ్య సమావేశం , స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతున్నాం: తిరుపతి జిల్లా అధ్యక్షులు నీరుగట్టు నగేష్
కడప, సెప్టెంబర్ 20: ఆంధ్రప్రదేశ్ ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర స్థాయి సర్వసభ్య సమావేశం కడప నగరంలోని సుల్తాన్ ఫంక్షన్ హాల్‌లో రాష్ట్ర అధ్యక్షులు శ్రీరా రమేష్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి కల్లూరి బాల సుబ్రహ్మణ్యం, రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకటాచలపతి తదితరులు పాల్గొన్నారు. పార్టీ సంస్థాగత బలోపేతం, భవిష్యత్ కార్యాచరణ, స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించారు. ఈ సందర్భంగా తిరుపతి జిల్లా అధ్యక్షులు నీరుగట్టు నగేష్ మాట్లాడుతూ, అరవింద్ కేజ్రీవాల్ మార్గదర్శకత్వంలో ఆంధ్రప్రదేశ్‌లో పార్టీని విస్తరించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు....