కొత్త ‘పింఛన్ల’కు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం

అమరావతి, సెప్టెంబర్ 7: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా ఎన్టీఆర్‌ భరోసా సామాజిక భద్రతా పింఛన్ల కోసం ప్రభుత్వం దరఖాస్తుల స్వీకరణకు శ్రీకారం చుట్టింది. అర్హత ఉన్నప్పటికీ ఇప్పటివరకు పింఛన్‌ పొందని వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచించారు. సెప్టెంబర్‌ 7 నుంచి 16 వరకు రాష్ట్రవ్యాప్తంగా స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు కేంద్రాల్లో కొత్త పింఛన్ల దరఖాస్తులను స్వీకరించనున్నారు. దరఖాస్తుల స్వీకరణతో పాటు ఆన్‌లైన్‌ నమోదు, ఈ-కేవైసీ ప్రక్రియను కూడా పూర్తి చేయనున్నారు. 📅 దరఖాస్తుల ప్రక్రియ ఇలా.. సెప్టెంబర్‌ 7–16: దరఖాస్తుల స్వీకరణ,...