అదనపు డైరెక్టర్‌ జగన్‌కు టీడబ్ల్యూజేఎఫ్‌ ఘన సన్మానం

సత్య వెలుగు – హైదరాబాద్ ప్రతినిధి సమాచార, పౌరసంబంధాల శాఖ అదనపు డైరెక్టర్‌గా పదోన్నతి పొందిన డీఎస్‌ జగన్‌కు తెలంగాణ వర్కింగ్‌ జర్నలిస్ట్స్‌ ఫెడరేషన్‌ (టీడబ్ల్యూజేఎఫ్‌) రాష్ట్ర కమిటీ శుభాకాంక్షలు తెలిపింది. బుధవారం హైదరాబాద్‌లోని సమాచార్‌ భవన్‌లో టీడబ్ల్యూజేఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి. బసవపున్నయ్య ఆధ్వర్యంలో ఫెడరేషన్‌ ప్రతినిధులు జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఉపాధ్యక్షులు ఎల్గోయి ప్రభాకర్‌, తాటికొండ కృష్ణ, బి. రాజశేఖర్‌, కార్యదర్శి గండ్ర నవీన్‌ తదితరులు జగన్‌కు పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. అనంతరం శాలువా కప్పి...