పంటి మెరుపులకు ఏఐ నిఘా.. దంత సంరక్షణలో కొత్త సాంకేతిక విప్లవం
హైదరాబాద్: దంత ఆరోగ్య పరిరక్షణలో కృత్రిమ మేధస్సు (ఏఐ) సాంకేతికత కీలక మార్పులకు దారితీస్తోంది. ఇప్పటివరకు దంత సమస్యలను గుర్తించేందుకు వైద్యుల పరిశీలన, ఎక్స్‌రేలు, ఇతర పరీక్షలపై ఆధారపడాల్సి వచ్చేది. అయితే తాజాగా అభివృద్ధి చెందుతున్న ఏఐ ఆధారిత సాంకేతికత దంతాల పరిస్థితిని మరింత వేగంగా, ఖచ్చితంగా విశ్లేషించేందుకు ఉపయోగపడుతోంది. ముఖ్యంగా దంతాలపై పేరుకుపోయే మచ్చలు, పంటి గార, దంత క్షయం, చిగుళ్ల సమస్యలు వంటి వాటిని ప్రారంభ దశలోనే గుర్తించేందుకు ఏఐ ఆధారిత ఇమేజింగ్ వ్యవస్థలు సహాయపడుతున్నాయి. దంతాల ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన...