చౌడేపల్లి బస్టాండ్‌లో ఎయిడ్స్‌పై కళాజాత ద్వారా అవగాహన

చౌడేపల్లి, సెప్టెంబర్ 26 (సత్య వెలుగు న్యూస్): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ, అన్నమయ్య జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా ఎయిడ్స్, లెప్రసీ, టీబీ అధికారి కార్యాలయం ఆధ్వర్యంలో శనివారం చౌడేపల్లి బస్టాండ్‌లోని పైసల్టర్‌లో కళాజాత ద్వారా ఎయిడ్స్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కళాజాత బృందం నాటకం ద్వారా ఎయిడ్స్ ఎలా సంక్రమిస్తుంది, ఎలా సంక్రమించదు, వ్యాధి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రజలకు వివరించింది. రక్తదానం, లైంగిక వ్యాధులకు చికిత్స, కండోమ్ వినియోగం, ఐసీటీసీ కౌన్సెలింగ్ కేంద్రాలు, క్షయ వ్యాధిపై కూడా...