sathyavelugu.com
Date of Publish : 17 September 2026, 12:17 am Posted by : KUMPATI SURESH

వాకాడులో పోలింగ్ కేంద్రాలపై అఖిలపక్ష సమావేశం

వాకాడు, సెప్టెంబర్ 16:
వాకాడు మండలంలో జరగనున్న 2026 ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితాపై బుధవారం ఎంపీడీవో కార్యాలయంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. తహసీల్దార్ సయ్యద్ ఇక్బాల్, ఎంపీడీవో సాయిప్రసాద్ తదితర అధికారుల ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. కల్లూరు పోలింగ్ కేంద్రం ఏర్పాటుపై అభ్యంతరం వ్యక్తం కాగా, అన్ని అభ్యంతరాలను పరిశీలించి తుది జాబితా రూపొందిస్తామని అధికారులు తెలిపారు.