అంబేద్కర్ ఒక చరిత్ర కాదు.. చరిత్ర గతిని మార్చిన మహోన్నత శక్తి,జననం నుంచి రాజ్యాంగ నిర్మాణం వరకు.. సమానత్వం కోసం సాగిన మహోన్నత పోరాటం

1.ఒక మనిషి.. ఒక ఉద్యమం.. ఒక మహోన్నత ఆలోచన భారతదేశ చరిత్రలో ఎంతోమంది నాయకులు పుట్టారు. కొందరు రాజకీయాలను ప్రభావితం చేశారు.. మరికొందరు సామాజిక మార్పుకు కృషి చేశారు. కానీ ఒక వ్యక్తి తన జీవితకాలంలో ఎదుర్కొన్న అవమానాలను, వివక్షను, అన్యాయాన్ని ఒక సమాజ విముక్తి ఉద్యమంగా మార్చిన వ్యక్తి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్. అంబేద్కర్‌ను కేవలం భారత రాజ్యాంగ నిర్మాతగా మాత్రమే చూడటం ఆయన జీవితాన్ని చాలా చిన్న పరిధిలో చూడటమే. ఆయన ఒక విద్యావేత్త.ఆర్థికవేత్త.న్యాయవేత్త.రాజనీతిజ్ఞుడు.సామాజిక సంస్కర్త.రచయిత.ప్రజాస్వామ్యవాది.సమానత్వం కోసం పోరాడిన మహోన్నత నాయకుడు....