sathyavelugu.com
Date of Publish : 22 September 2026, 10:33 pm Posted by : Dr.K.Suresh Editor

అంగన్వాడీ పౌష్టికాహారంతో ఆరోగ్యవంతమైన సమాజం

చౌడేపల్లి, సెప్టెంబర్ 22 – సత్య వెలుగు న్యూస్:
అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించే పౌష్టికాహారంతో తల్లులు, పిల్లలు ఆరోగ్యంగా ఉండి ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించవచ్చని ఐసీడీఎస్ సూపర్‌వైజర్ రాధమ్మ అన్నారు. పౌష్టికాహార మాసోత్సవాల్లో భాగంగా దుర్గసముద్రం పంచాయతీ బండమీదపల్లి అంగన్వాడీ కేంద్రంలో తల్లులు, బాలింతలు, కిశోర బాలికలకు పౌష్టికాహారంపై అవగాహన కల్పించారు. అనంతరం పౌష్టికాహారంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో అంగన్వాడీ సిబ్బంది, తల్లులు, బాలింతలు, కిశోర బాలికలు పాల్గొన్నారు.