sathyavelugu.com
Date of Publish : 26 September 2026, 8:55 pm Posted by : Dr.K.Suresh Editor

ఏపీ–తమిళనాడు మత్స్యకారుల సమస్యలపై ఉన్నతస్థాయి సమావేశం

నాయుడుపేట: పులికాట్ సరస్సులో ఆంధ్రప్రదేశ్–తమిళనాడు మత్స్యకారులు ఎదుర్కొంటున్న వేట, సరిహద్దు సమస్యల పరిష్కారంపై శనివారం గుమ్మిడిపూండి ఎండీఓ కార్యాలయంలో ద్వైపాక్షిక సమన్వయ సమావేశం జరిగింది.

సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ, పొన్నేరి ఎమ్మెల్యే డాక్టర్ ఎం.ఎస్. రవి, తిరువళ్లూరు జిల్లా కలెక్టర్ ఎస్. కవిత, తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్. గోవిందరావు తదితరులు పాల్గొన్నారు.

సరిహద్దు జలాలను శాస్త్రీయంగా గుర్తించి స్పష్టమైన హద్దులు ఏర్పాటు చేయడంతో పాటు, మత్స్యకారుల జీవనోపాధి కోసం ‘ఫ్రీ జోన్’ ఏర్పాటు ప్రతిపాదనపై చర్చించారు. ఇరు రాష్ట్రాల అధికారులు సమన్వయంతో పనిచేసి భవిష్యత్తులో వివాదాలకు తావులేకుండా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.