అభివృద్ధి పట్టణంలో అవస్థల బతుకులు.. నాయుడుపేటలో సంచార జాతుల కన్నీటి కథ
నాయుడుపేట | సత్య వెలుగు న్యూస్ అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న నాయుడుపేట పట్టణంలో మరోవైపు సంచార జాతుల జీవన పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. నిలువ నీడ లేక, శాశ్వత నివాస స్థలం లేక, రహదారి డివైడర్లనే ఆశ్రయంగా చేసుకుని జీవిస్తున్న కుటుంబాల పరిస్థితి దయనీయంగా మారింది. పగటిపూట చిరు వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ఈ కుటుంబాలకు కనీస వసతులు కూడా అందుబాటులో లేకపోవడం ప్రశ్నార్థకంగా మారింది. కోర్టు ఆదేశాలతో గుడారాలు తొలగింపు.. ఆ తర్వాత? నాయుడుపేట పట్టణంలోని చంద్రప్రియ లాడ్జి, బీఎస్ఎన్ఎల్ కార్యాలయం...