హెచ్ఐవీ/ఎయిడ్స్‌పై అవగాహన ఇంటెన్షిఫైడ్ ఐఈసీ క్యాంపెయిన్‌లో భాగంగా నెలబల్లిలో అవగాహన సదస్సు, ర్యాలీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, దిశా విభాగం సహకారంతో నవజీవన్ ఆర్గనైజేషన్ సీసీ–పీయూ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో “ఇంటెన్షిఫైడ్ ఐఈసీ క్యాంపెయిన్” కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా దొరవారిసత్రం మండలంలోని నెలబల్లి గ్రామంలో మంగళవారం హెచ్ఐవీ/ఎయిడ్స్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ మేనేజర్ కె. బాలాజీ మాట్లాడుతూ హెచ్ఐవీ/ఎయిడ్స్ వ్యాప్తికి సంబంధించిన కారణాలు, వ్యాధి ఎలా వ్యాపిస్తుంది, ఎలా వ్యాపించదనే అంశాలతో పాటు లక్షణాలు, నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించారు....