ఎన్నికల వేళ అప్రమత్తంగా ఉండాలి.. ఎస్సై శివశంకర్ గంజాయి, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి.. సైబర్ నేరాలపై జాగ్రత్త

నాయుడుపేట, సెప్టెంబర్ 24 (సత్య వెలుగు NEWS):త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో సజావుగా జరిగేందుకు ప్రజలు పోలీసులకు సహకరించాలని నాయుడుపేట పట్టణ ఎస్సై ఎం. శివశంకర్ రావు కోరారు. చిగురుపాడు గ్రామాన్ని సందర్శించిన ఎస్సై ప్రజలకు పలు సూచనలు చేశారు. ఎన్నికల సమయంలో అల్లర్లకు పాల్పడకుండా శాంతిభద్రతలకు సహకరించాలని సూచించారు. విద్యార్థులు వివాదాల్లో పాల్గొని భవిష్యత్తును నష్టపరుచుకోవద్దని హెచ్చరించారు. అలాగే గంజాయి, ఇతర మత్తు పదార్థాల విక్రయాలు, వినియోగంపై పోలీసులకు సమాచారం ఇవ్వాలని, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని...