ఘనంగా మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు జన్మదిన వేడుకలు

బెల్లంకొండ: పెదకూరపాడు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు జన్మదిన వేడుకలు నియోజకవర్గ వ్యాప్తంగా అభిమానులు, పార్టీ శ్రేణుల మధ్య ఘనంగా జరిగాయి. సోషల్ మీడియా అధ్యక్షుడు మట్టారెడ్డి, పల్నాడు జిల్లా యువజన విభాగం కార్యదర్శి వజ్రాల శ్రీనివాసరెడ్డి (డైమండ్ రెడ్డి), జిల్లా మైనారిటీ విభాగ కార్యదర్శి రుద్రపాటి హుసేన్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు శంకరరావు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో మరెన్నో జన్మదినాలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.