తిరుపతి పర్యటనకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్
తిరుపతి, సెప్టెంబర్ 22,సత్య వెలుగు న్యూస్: భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ మంగళవారం సాయంత్రం 4 గంటలకు తిరుపతి విమానాశ్రయానికి చేరుకోనున్నారు. అనంతరం పుత్తూరులోని సిద్ధార్థ కళాశాలలో జరిగే విశ్వ గురు సంకల్ప సిద్ధి యాగం మరియు ‘నమో సేవా గాథ’ వీధి నాటకం కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా పాల్గొంటారు. ఈ విషయాన్ని బీజేపీ తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శి డా. కదిరి నరేష్ బాబు తెలిపారు.