చౌడేపల్లిలో భక్తిశ్రద్ధల నడుమ బొజ్జ గణపయ్య నిమజ్జనం
చౌడేపల్లి, సెప్టెంబర్ 20: చౌడేపల్లి పట్టణంలో వినాయక చవితి ఉత్సవాలు ముగిశాయి. మండల పరిధిలోని పలు ప్రాంతాల్లో భక్తిశ్రద్ధలతో పూజలందుకున్న గణనాథుల విగ్రహాలను ఆదివారం ఘనంగా నిమజ్జనం చేశారు. మండల కేంద్రంలోని నేతాజీ నగర్, బజార్ వీధి, శ్రీరామస్వామి ఆలయ సమీప ప్రాంతాలతో పాటు వివిధ వీధుల్లో ప్రతిష్ఠించిన వినాయక విగ్రహాలను ప్రత్యేక అలంకరణలతో నిమజ్జనానికి తరలించారు. నిమజ్జనోత్సవంలో భాగంగా యువతీ యువకులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, కోలాటాలు, నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ‘బళ్లారి డ్రమ్స్’ వాయిద్యాల హోరుతో...