మీ అసైన్డ్ భూమి అమ్ముకోవచ్చా? ఏపీ ప్రభుత్వం కొత్త నిబంధనలు ఇవే!
అమరావతి, సెప్టెంబర్ 16:ఆంధ్రప్రదేశ్‌లో అసైన్డ్, ఫ్రీహోల్డ్ భూముల రిజిస్ట్రేషన్లపై ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. చట్టబద్ధంగా ఫ్రీహోల్డ్ హక్కులు పొందిన 7,85,500 ఎకరాల అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్లకు ప్రభుత్వం అనుమతి కల్పించింది. ఎవరు భూమిని అమ్ముకోవచ్చు? ప్రస్తుతం ప్రతి అసైన్డ్ భూమిని ఇష్టానుసారం అమ్ముకోవచ్చని కాదు. భూమికి ఫ్రీహోల్డ్ హక్కులు చట్టబద్ధంగా మంజూరై, రికార్డుల్లో ఆ హోదా ఉన్న భూములకే రిజిస్ట్రేషన్ అవకాశం ఉంటుంది. అదేవిధంగా, అసైన్డ్ భూమిగా తప్పుగా నమోదైన 5,422 ఎకరాల ప్రైవేట్ పట్టా భూములకు కూడా రిజిస్ట్రేషన్‌కు ప్రభుత్వం...