లక్ష మంది స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు ఉద్యోగులతో సెప్టెంబర్ 27న చలో విజయవాడ

తిరుపతి: స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సెప్టెంబర్ 27న లక్ష మంది ఉద్యోగులతో చలో విజయవాడ కార్యక్రమం నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఉద్యోగుల ఐక్యవేదిక ప్రతినిధి తోటకూర కోటేశ్వరరావు తెలిపారు. తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సెప్టెంబర్ 23న ప్రభుత్వ ఉన్నతాధికారులు, శాఖా మంత్రితో ఉద్యోగ సంఘాల సమావేశం జరగనుందని తెలిపారు. సమస్యలకు పరిష్కారం లభించకపోతే రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల ఎదుట నిరసనలు చేపట్టి, అనంతరం చలో విజయవాడ నిర్వహిస్తామని చెప్పారు. AAS అమలు, రెండు నోషనల్ ఇంక్రిమెంట్లు,...