sathyavelugu.com
Date of Publish : 07 September 2026, 4:43 pm Posted by : KUMPATI SURESH

తెలంగాణ శాసనసభ సమావేశాలు ప్రత్యక్ష ప్రసారం అసెంబ్లీలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి

హైదరాబాద్: తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన సమావేశాల్లో పలు కీలక అంశాలపై చర్చ కొనసాగుతోంది. సభలో ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు.

సభలో ప్రతిపక్షాలు లేవనెత్తిన అంశాలపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యంగా 22ఏ నిషేధిత భూముల జాబితా అంశంపై అసెంబ్లీలో చర్చిస్తామని ఆయన తెలిపారు. ప్రజాస్వామ్యంలో చర్చల తర్వాతే నిర్ణయాలు తీసుకుంటామని పేర్కొన్నారు.

అదే సమయంలో సభాపతి గౌరవానికి సంబంధించిన అంశంపై కూడా అసెంబ్లీలో తీవ్ర చర్చ జరిగింది. స్పీకర్‌ గడ్డం ప్రసాద్ కుమార్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన వ్యాఖ్యలపై అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు.

తెలంగాణ శాసనసభలో ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి ప్రసంగాన్ని ప్రత్యక్షంగా వీక్షించండి.