అటవీ సంపద, వన్యప్రాణులు, పర్యావరణ పరిరక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన అటవీ శాఖ సిబ్బందికి అటవీ అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా సీఎం ఎ. రేవంత్ రెడ్డి ఘన నివాళులు అర్పించారు. వారి ధైర్యం, అంకితభావం, త్యాగాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. అడవులు, వన్యప్రాణులను కాపాడుతూ భావితరాలకు సురక్షితమైన పర్యావరణాన్ని అందించాలని పిలుపునిచ్చారు.