sathyavelugu.com
Date of Publish : 11 September 2026, 6:18 pm Posted by : KUMPATI SURESH

చాకలి ఐలమ్మకు సీఎం రేవంత్ రెడ్డి నివాళి

హైదరాబాద్: భూమి, భుక్తి, వెట్టి చాకిరి విముక్తి కోసం గడీల పాలనకు వ్యతిరేకంగా పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆమెకు నివాళులర్పించారు. భూస్వామ్య దోపిడీ, నిరంకుశత్వానికి ఎదురొడ్డి పేదలు, బలహీన వర్గాల హక్కుల కోసం ఐలమ్మ చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిందన్నారు.

సామాజిక న్యాయం, సమానత్వం, ఆత్మగౌరవం కోసం ఆమె చూపిన తెగువ నేటి తరానికి స్ఫూర్తిదాయకమని సీఎం పేర్కొన్నారు.