కాంట్రాక్టు విద్యుత్ కార్మికులను రెగ్యులర్ చేయాలి
సత్య వెలుగు న్యూస్, నాయుడుపేట,: విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులను రెగ్యులర్ చేసి, తెలంగాణ తరహాలో రూ.48 వేల జీతం అందించాలని ఏపీ విద్యుత్ స్ట్రగుల్ కమిటీ నాయకులు డిమాండ్ చేశారు. పీఆర్సీ సంప్రదింపుల కమిటీని వెంటనే ఏర్పాటు చేయడంతో పాటు జేఎల్ఎంలను ఏఎల్ఎంలుగా ప్రమోట్ చేయాలని కోరారు. కార్మికుల సమస్యలపై ఈ నెల 21 నుంచి చేపట్టిన బైక్ ర్యాలీ–చైతన్య యాత్ర 27న వెంకటగిరి నుంచి నాయుడుపేట, కాళహస్తి మీదుగా తిరుపతికి చేరుకుంది. బీసీ రేట్ కార్మికులకు అర్హతల ఆధారంగా షిఫ్ట్...