వాడేసిన వంట నూనెతో వంటలు, ప్రజల ఆరోగ్యానికి ముప్పు.. ఆకస్మిక తనిఖీలు చేయాలి – AAP డిమాండ్

తిరుపతి, సత్య వెలుగు న్యూస్,సెప్టెంబర్ 29: తిరుపతి నగరంలోని పలు రెస్టారెంట్లు, హోటళ్లలో వాడేసిన వంట నూనెను (Used Cooking Oil) అనధికారికంగా సేకరించి, నగరంలోని కొన్ని ఇళ్లలో వంట పదార్థాలు తయారు చేసి విక్రయిస్తున్నారనే ఆరోపణలపై ఆమ్ ఆద్మీ పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది. వాడేసిన వంట నూనెను తిరిగి ఆహార తయారీలో ఉపయోగిస్తే ప్రజల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలు ఉండే అవకాశం ఉందని, ఈ వ్యవహారంపై సంబంధిత అధికారులు తక్షణమే దృష్టి సారించాలని ఆమ్ ఆద్మీ పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షులు...