అంకుతోటపల్లిలో పారిశుద్ధ్య చర్యలు పరిశీలించిన డిప్యూటీ ఎంపీడీవో గఫూర్

చౌడేపల్లి, సెప్టెంబర్ 22 – సత్య వెలుగు న్యూస్:మండలంలోని కొత్తకోట పంచాయతీ అంకుతోటపల్లిలో మంగళవారం డిప్యూటీ ఎంపీడీవో గఫూర్ పారిశుద్ధ్య చర్యలను పరిశీలించారు. గ్రామంలో కొంతకాలంగా ఉన్న కాలువ సమస్యను పరిష్కరించి, మురుగునీరు సజావుగా వెళ్లేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కాలువలను ఆక్రమించడం, పైపులైన్లను ధ్వంసం చేయడం వంటి చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం గ్రామంలో పర్యటించి మంచినీటి సరఫరా, పారిశుద్ధ్య పరిస్థితులపై పంచాయతీ కార్యదర్శి నాగేంద్రను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు.