ఇన్‌టచ్ పరిశ్రమలో 29 మంది కార్మికుల తొలగింపు అన్యాయం పరిశ్రమ ముందు సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా
నాయుడుపేట, సెప్టెంబర్ 7 : ఓజిలి మండలం అత్తివరం గ్రామంలోని ఇన్‌టచ్ పరిశ్రమలో 29 మంది స్థానిక కార్మికులను విధుల నుంచి తొలగించడం అన్యాయమని సీఐటీయూ నాయకులు ఆరోపించారు. సోమవారం కార్మికులతో కలిసి పరిశ్రమ ప్రధాన గేటు వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కేరడార్ అధ్యక్షులు ఎస్.కె. అబ్దుల్లా మాట్లాడుతూ స్థానికులకు ఉపాధి కల్పించకుండా ఇతర రాష్ట్రాల నుంచి కార్మికులను తీసుకువస్తున్నారని ఆరోపించారు. స్థానిక కార్మికులకు కనీస వేతనం, పీఎఫ్, ఈఎస్ఐ, ఇంక్రిమెంట్లు, వేతనంతో కూడిన సెలవులు, ట్రావెల్ చార్జీలు వంటి సౌకర్యాలు...