పుంగనూరు రాంనగర్ మోడల్ స్కూల్లో కరాటే, యోగా యూనిఫామ్స్ పంపిణీ
పుంగనూరు, సెప్టెంబర్ 24 (సత్య వెలుగు NEWS):పుంగనూరు పట్టణంలోని రాంనగర్ మోడల్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు కరాటే, యోగా యూనిఫామ్స్ పంపిణీ చేశారు. తల్లిదండ్రులు, దాతల సహకారంతో ఏర్పాటు చేసిన యూనిఫామ్స్‌ను మండల విద్యాశాఖ అధికారి రెడ్డన్న శెట్టి విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎంఈఓ రెడ్డన్న శెట్టి మాట్లాడుతూ విద్యార్థుల్లో శారీరక, మానసిక నైపుణ్యాలను పెంపొందించేందుకు పాఠశాలలో కరాటే, యోగా తరగతులు నిర్వహించడం అభినందనీయమన్నారు. విద్యార్థులకు యూనిఫామ్స్ అందించిన తల్లిదండ్రులు, దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రధానోపాధ్యాయురాలు కళావతి మాట్లాడుతూ ప్రతి బుధవారం, శనివారం...