చెంబేడులో ఘనంగా వైఎస్సార్‌సీపీ ఐడీ కార్డుల పంపిణీ, మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య సమక్షంలో పార్టీ శ్రేణులకు ఐడీ కార్డుల అందజేత

పెళ్లకూరు, సెప్టెంబర్ 25 (సత్య వెలుగు న్యూస్): పెళ్లకూరు మండలం చెంబేడు గ్రామంలో వైఎస్సార్‌సీపీ పార్టీ శ్రేణులకు ఐడీ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మండల వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు ఒబ్బు వెంకటరత్నం ఆధ్వర్యంలో ఆయన నివాసం వద్ద శుక్రవారం ఈ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ముఖ్య అతిథిగా హాజరై పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఐడీ కార్డులు అందజేశారు. పెళ్లకూరు మండలంలో పార్టీ కార్యకలాపాలను మరింత సమన్వయంతో నిర్వహించేందుకు ఐడీ కార్డుల పంపిణీ చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో...