ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా రూ.2.85 లక్షల ఆర్థిక సాయం

పుత్తూరు: పుత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని వీరపరెడ్డిపాలెంకు చెందిన బి. బాబు అనారోగ్యంతో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వైద్య ఖర్చులకు ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో, ఆయన కుటుంబ సభ్యులు నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్‌ను కలిసి ముఖ్యమంత్రి సహాయ నిధి (LOC) ద్వారా ఆర్థిక సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. కుటుంబ సభ్యుల విజ్ఞప్తిపై ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ సిఫారసు చేయడంతో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా రూ.2,85,605/- ఆర్థిక సాయం మంజూరైంది. మంజూరు లేఖను సంబంధిత ఆసుపత్రికి పంపినట్లు...