sathyavelugu.com
Date of Publish : 22 September 2026, 9:22 pm Posted by : Dr.K.Suresh Editor

డైకిన్ కంపెనీలో అగ్ని ప్రమాదం, ఎఫ్‌జీ ఏరియాలో చెలరేగిన మంటలు.. ఫైర్‌ ఇంజన్‌తో అదుపులోకి తెచ్చే ప్రయత్నం

తడ: వరదయ్యపాలెం మండలం శ్రీ సిటీ సమీపంలోని డైకిన్ కంపెనీలో మంగళవారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. కంపెనీలోని ఎఫ్‌జీ (FG) ఏరియాలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో సిబ్బంది అప్రమత్తమయ్యారు.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఫైర్‌ ఇంజన్‌తో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలు మరింత వ్యాప్తి చెందకుండా అదుపులోకి తీసుకురావడానికి చర్యలు చేపట్టారు.

ఈ ఘటనలో కంపెనీలో కొంతమేర నష్టం వాటిల్లినట్లు సమాచారం. అయితే అగ్ని ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు, ఆస్తి నష్టం ఎంతమేరకు జరిగిందనే వివరాలు అధికారికంగా తెలియాల్సి ఉంది. ప్రమాద సమయంలో ఎవరైనా గాయపడ్డారా అనే అంశంపై కూడా పూర్తి సమాచారం అందాల్సి ఉంది.