బూరగపల్లిలో మంచినీటి సమస్య పరిష్కరించాలి

చౌడేపల్లి, సెప్టెంబర్ 20 (సత్యవెలుగు న్యూస్): మండలంలోని అమినిగుంట పంచాయతీ బూరగపల్లిలో నెలకొన్న మంచినీటి సమస్యను అధికారులు వెంటనే పరిష్కరించాలని జనసేన మండల పార్టీ అధ్యక్షుడు గందోడి చరణ్ రాయల్ కోరారు. గ్రామంలో పర్యటించిన ఆయన స్థానికులతో మాట్లాడి తాగునీటి సమస్యపై వివరాలు తెలుసుకున్నారు. గత కొంతకాలంగా గ్రామస్తులు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. గ్రామానికి నీరు సరఫరా చేసే బోరులో భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో సమస్య ఏర్పడిందన్నారు. ప్రత్యామ్నాయంగా కొత్త బోరు ఏర్పాటు చేసే వరకు ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా...