sathyavelugu.com
Date of Publish : 09 September 2026, 12:53 pm Posted by : KUMPATI SURESH

ఇకపై 25 రోజులకే గ్యాస్ సిలిండర్ బుకింగ్

ఇకపై 25 రోజులకే గ్యాస్ సిలిండర్ బుకింగ్

ఎల్పీజీ సిలిండర్ రీఫిల్ బుకింగ్‌పై కేంద్ర ప్రభుత్వం కీలక మార్పు చేసింది. ఇకపై పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని గృహ వినియోగదారులందరూ 25 రోజుల తర్వాతే గ్యాస్ సిలిండర్ రీఫిల్ బుక్ చేసుకునేలా కొత్త నిబంధన తీసుకొచ్చింది.

గతంలో పట్టణాల్లో 25 రోజులు, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజుల వ్యవధి ఉండేది. తాజాగా ఈ తేడాను తొలగిస్తూ దేశవ్యాప్తంగా 25 రోజుల కనీస బుకింగ్ వ్యవధిని కేంద్ర పెట్రోలియం, సహజవాయు మంత్రిత్వశాఖ నిర్ణయించింది. ఈ నిబంధనలు వెంటనే అమల్లోకి వస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.