ప్రెస్ క్లబ్ ప్రారంభించడం ఆనందంగా ఉంది: మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం
సత్య వెలుగు న్యూస్, నాయుడుపేట: నాయుడుపేట పట్టణంలో ప్రెస్ క్లబ్ ప్రారంభించడం ఆనందంగా ఉందని, విలేకరులకు కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని సూళ్లూరుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్, మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం అన్నారు. శ్రీ బాలాజీ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో ఆదివారం నూతనంగా ఏర్పాటు చేసిన ప్రెస్ క్లబ్‌ను ఆయన టీడీపీ నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియా మిత్రులకు శుభాకాంక్షలు తెలిపారు. నాయుడుపేటలో ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేయడం అభినందనీయమని, పాత్రికేయులంతా ఐక్యంగా పనిచేసి క్లబ్‌ను మరింత...