పల్నాడు జిల్లా ఆర్యవైశ్య సంఘం పబ్లిక్ రిలేషన్ కమిటీ వైస్ చైర్మన్‌గా గొడవర్తి కృష్ణమూర్తి

బెల్లంకొండ: పాపాయపాలెం గ్రామానికి చెందిన ప్రముఖ సామాజిక కార్యకర్త గొడవర్తి కృష్ణమూర్తికి పల్నాడు జిల్లా ఆర్యవైశ్య సంఘంలో కీలక బాధ్యతలు అప్పగించారు. ఆయనను పబ్లిక్ రిలేషన్ కమిటీ వైస్ చైర్మన్‌గా నియమిస్తూ జిల్లా అధ్యక్షుడు చందోలు వెంకట సూర్యప్రకాష్ రావు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన జిల్లా అధ్యక్షుడు, సంఘ పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు. అప్పగించిన బాధ్యతలను క్రమశిక్షణతో నిర్వహిస్తూ ఆర్యవైశ్య సమాజ సేవకు, సంఘ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. ఆయన నియామకంపై గ్రామస్థులు,...