913 ఆశా కార్యకర్తల పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 913 ఆశా కార్యకర్తల పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి వెల్లడించారు. గ్రామీణ, గిరిజన, పట్టణ ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడం ద్వారా ప్రజలకు ప్రాథమిక ఆరోగ్య సేవలను మరింత చేరువ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రెండేళ్లలో 1,294 పోస్టుల భర్తీ రాష్ట్రంలో ఆశా కార్యకర్తల ఖాళీలను తగ్గించేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న జీరో వేకెన్సీ విధానంలో భాగంగా గత రెండేళ్లలో 1,294 ఆశా కార్యకర్తల...