చౌడేపల్లిలో వైసీపీ ప్రజాప్రతినిధులకు ఘన వీడ్కోలు, పదవీకాలం ముగియడంతో జడ్పీటీసీ, ఎంపీటీసీలకు సన్మానం
చౌడేపల్లి, సెప్టెంబర్ 24 (సత్య వెలుగు NEWS):చౌడేపల్లి మండలంలోని వైసీపీ జడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీ ప్రజాప్రతినిధులకు మండల వైసీపీ ఆధ్వర్యంలో ఘన వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు తమ పదవీకాలంలో చేపట్టిన తాగునీరు, రోడ్లు, లింక్ రోడ్లు, బోయకొండ గంగమ్మ ఆలయ అభివృద్ధి తదితర కార్యక్రమాలను గుర్తుచేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని నాయకులు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఎంపీపీ, ఎంపీటీసీ, జడ్పీటీసీల పదవీకాలం సెప్టెంబర్ 23, 24 తేదీలతో ముగుస్తున్న నేపథ్యంలో ఈ వీడ్కోలు కార్యక్రమం...