సత్తెనపల్లి:సత్య వెలుగు న్యూస్: పట్టణ పరిధిలోని బృందావనం అపార్ట్మెంట్స్‌లో వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అపార్ట్మెంట్ సభ్యుల ప్రత్యేక ఆహ్వానం మేరకు పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు దరువురి నాగేశ్వరరావు ఆదివారం పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన వినాయక విగ్రహాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అపార్ట్మెంట్ ఆవరణలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో చిన్నారులు ప్రదర్శించిన భరతనాట్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చిన్నారుల నృత్య ప్రదర్శనలను వీక్షించిన దరువురి నాగేశ్వరరావు వారి ప్రతిభను అభినందించారు. ప్రతిభ కనబరిచిన చిన్నారులకు తన చేతుల మీదుగా బహుమతులు అందజేశారు.
ఈ సందర్భంగా దరువురి నాగేశ్వరరావు మాట్లాడుతూ, సనాతన ధర్మంలో వినాయక చవితికి ఎంతో ప్రాముఖ్యత ఉందని అన్నారు. ఇలాంటి పండుగలు ప్రజల మధ్య ఐక్యతను, భక్తిభావాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. అపార్ట్మెంట్ సభ్యులంతా ఒకే కుటుంబంలా కలిసికట్టుగా పండుగను నిర్వహించడం అభినందనీయమన్నారు. సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా చిన్నారుల్లోని ప్రతిభను ప్రోత్సహించడం మంచి సంప్రదాయమని అన్నారు.
ఈ కార్యక్రమంలో అపార్ట్మెంట్ సభ్యులు, స్థానిక భక్తులు, పట్టణ టీడీపీ నాయకులు, తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.