సత్తెనపల్లిలో ఘనంగా వినాయక చవితి వేడుకలు, బృందావనం అపార్ట్మెంట్స్‌లో పూజలు.. చిన్నారుల భరతనాట్య ప్రదర్శనలు
సత్తెనపల్లి:సత్య వెలుగు న్యూస్: పట్టణ పరిధిలోని బృందావనం అపార్ట్మెంట్స్‌లో వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అపార్ట్మెంట్ సభ్యుల ప్రత్యేక ఆహ్వానం మేరకు పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు దరువురి నాగేశ్వరరావు ఆదివారం పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన వినాయక విగ్రహాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అపార్ట్మెంట్ ఆవరణలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో చిన్నారులు ప్రదర్శించిన భరతనాట్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చిన్నారుల నృత్య ప్రదర్శనలను వీక్షించిన దరువురి నాగేశ్వరరావు వారి ప్రతిభను అభినందించారు. ప్రతిభ కనబరిచిన చిన్నారులకు...