చౌడేపల్లి ఎస్సీ హాస్టల్‌లో ఘనంగా గుర్రం జాషువా, భగత్ సింగ్ జయంతి వేడుకలు

చౌడేపల్లి, సెప్టెంబర్ 28 – సత్య వెలుగు న్యూస్: మండల కేంద్రమైన చౌడేపల్లిలోని ఎస్సీ బాలుర వసతి గృహంలో జాతీయ నాయకులు గుర్రం జాషువా, భగత్ సింగ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ వ్యవస్థాపక అధ్యక్షుడు బ్యాంకు రెడ్డప్ప ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా గుర్రం జాషువా, భగత్ సింగ్ జీవిత చరిత్రలను, దేశానికి వారు చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. సమాజంలో సమానత్వం, సామాజిక చైతన్యం కోసం గుర్రం జాషువా చేసిన కృషిని,...