స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టులో వాడివేడి వాదనలు, వైసీపీ పిటిషన్, తక్షణ ఎన్నికల పిల్‌పై తీర్పు రిజర్వ్.. బీసీ రిజర్వేషన్లపైనా ఉత్కంఠ

అమరావతి, సెప్టెంబర్ 24 (సత్య వెలుగు NEWS):ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై దాఖలైన పలు పిటిషన్లపై గురువారం హైకోర్టులో కీలక విచారణ జరిగింది. ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రధాన పిటిషన్లపై వాదనలు పూర్తికావడంతో ధర్మాసనం తీర్పులను రిజర్వ్ చేసింది. ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ పూర్తయ్యే వరకు స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయాలని కోరుతూ వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై వాదనలు ముగిశాయి. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలను వీలైనంత త్వరగా నిర్వహించాలని న్యాయవాది...