సేంద్రియ, జీవన ఎరువులతో అధిక దిగుబడులు: ఏరువాక శాస్త్రవేత్తలు

బెల్లంకొండ: సేంద్రియ, జీవన ఎరువులను వినియోగించడం ద్వారా భూసారం పెరగడంతో పాటు సాగు ఖర్చు తగ్గి నాణ్యమైన దిగుబడులు పొందవచ్చని నరసరావుపేట ఏరువాక కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ ఎం. నగేష్, విస్తరణ శాస్త్రవేత్త డాక్టర్ పి.వి. సత్య గోపాల్ తెలిపారు. శుక్రవారం బెల్లంకొండలో కంది పంట క్షేత్ర సందర్శన నిర్వహించి రైతులకు పలు సూచనలు చేశారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో కంది, పెసర, మినుము వంటి ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని సూచించారు. కంది పంటలో మొక్కలు అధిక ఎత్తు పెరిగితే పైభాగాన్ని కత్తిరించడం...