నిరుపేదలకు తక్షణమే ఇంటి స్థలాలు మంజూరు చేయాలి, సర్వే నంబర్ 199లో స్థలాల కోసం పేదల విజ్ఞప్తి
పుత్తూరు, సెప్టెంబర్ 29 — సత్య వెలుగు న్యూస్: తిరుపతి జిల్లా పుత్తూరు మండలం నందిమంగళం (కోనేటిపాలెం) పరిధిలోని సర్వే నంబర్ 199లో నిరుపేదలకు తక్షణమే ఇంటి స్థలాలు మంజూరు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇళ్లు లేక, అద్దెలు చెల్లించలేక, ఉమ్మడి కుటుంబాల్లో ఇరుకైన గదుల్లో నివసిస్తూ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పేద కుటుంబాలు వాపోతున్నాయి. కొందరు కనీసం తలదాచుకునేందుకు గుడారాలు ఏర్పాటు చేసుకుని జీవిస్తున్నారని తెలిపారు. గుడారాలు ఏర్పాటు చేసుకున్న ప్రాంతానికి రెవెన్యూ అధికారులు వచ్చి అది ప్రభుత్వ భూమి కావడంతో...