జ్వరాల నివారణకు ఇంటింటా సర్వే, దోమల లార్వా గుర్తింపుపై ఆరోగ్య సిబ్బంది ప్రత్యేక దృష్టి

పెళ్లకూరు, సెప్టెంబర్ 24 (సత్య వెలుగు NEWS):జ్వరాల వ్యాప్తి నివారణలో భాగంగా పెళ్లకూరు మండలం దిగువచావలి గ్రామంలో ఆరోగ్య శాఖ సిబ్బంది ఇంటింటా సర్వే నిర్వహించారు. ప్రజల ఆరోగ్య పరిస్థితులను తెలుసుకోవడంతో పాటు జ్వర లక్షణాలు ఉన్నవారి వివరాలను సేకరించారు. ఇళ్ల పరిసరాల్లో నీటి నిల్వలు, దోమల లార్వా వృద్ధికి అనుకూల పరిస్థితులను పరిశీలించి, నీరు నిల్వ ఉండకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు సూచించారు. జ్వరం లేదా ఇతర అనారోగ్య లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీప ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని అవగాహన...