sathyavelugu.com
Date of Publish : 17 September 2026, 12:04 am Posted by : KUMPATI SURESH

వినాయక విగ్రహాల నిమజ్జనం ఘనంగా

చౌడేపల్లి, సెప్టెంబర్ 16:
పట్టణంలో మూడు రోజులపాటు పూజలు అందుకున్న వినాయక విగ్రహాల నిమజ్జన కార్యక్రమాన్ని బుధవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. శ్రీ అభీష్టల మృత్యుంజయేశ్వర స్వామి ఆలయం ఎదుట ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాన్ని యువత పట్టణంలో ఊరేగింపుగా తీసుకెళ్లి, సమీపంలోని వ్యవసాయ బావిలో నిమజ్జనం చేశారు. బజార్ వీధి, గాంధీ వీధి తదితర ప్రాంతాల్లోనూ నిమజ్జన వేడుకలు కోలాహలంగా సాగాయి. భక్తి పాటలతో యువత నృత్యాలు చేస్తూ ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు.