చండ్రాజుపాలెంలో ఘనంగా విఘ్నేశ్వర నవరాత్రులు రూ.43 వేలకు పలికిన తొలి లడ్డు.. భక్తిశ్రద్ధలతో స్వామివారి ఊరేగింపు
బెల్లంకొండ: మండల పరిధిలోని చండ్రాజుపాలెం గ్రామంలోని వెంకటేశ్వర స్వామి దేవస్థానం వద్ద ఏర్పాటు చేసిన విఘ్నేశ్వర స్వామి మండపంలో ఐదు రోజుల పాటు నవరాత్రి పూజా కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. ప్రతిరోజూ ప్రత్యేక పూజలు, ధూపదీప నైవేద్యాలతో స్వామివారి మండపం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఐదో రోజు పూజా కార్యక్రమాలు ముగిసిన అనంతరం ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో స్వామివారి చేతిలోని మహాప్రసాదం లడ్డూల వేలం పాట నిర్వహించారు. భక్తులు ఉత్సాహంగా పాల్గొని లడ్డూ ప్రసాదాలను పోటీపడి దక్కించుకున్నారు. లడ్డు వేలం వివరాలు ఇలా ఉన్నాయి:...