మహిళల ఆసియా కప్ 2026 విజేతగా భారత్‌.. 8వసారి చరిత్ర సృష్టించిన టీమిండియా

దుబాయ్, సెప్టెంబర్ 14 (సత్య వెలుగు న్యూస్):మహిళల టీ20 ఆసియా కప్‌–2026లో భారత మహిళల క్రికెట్ జట్టు అద్భుత విజయాన్ని సాధించింది. శ్రీలంకతో జరిగిన ఫైనల్‌లో 72 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన భారత్‌.. రికార్డు స్థాయిలో 8వసారి ఆసియా కప్‌ టైటిల్‌ను కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్‌ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. ఓపెనర్లు షఫాలీ వర్మ (68), స్మృతి మందాన (59) అద్భుతమైన బ్యాటింగ్‌తో జట్టుకు భారీ స్కోరు అందించారు. వీరిద్దరూ...