సత్య వెలుగు న్యూస్ : దొరవారిసత్రం
తిరుపతి జిల్లా దొరవారిసత్రం మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల పాఠశాలలో వృత్తి విద్యా కోర్సులు చదువుతున్న విద్యార్థులకు బుధవారం ఇండస్ట్రియల్ విజిట్ నిర్వహించారు.
ప్రిన్సిపాల్ తిరుపతయ్య సూచనల మేరకు, వృత్తి విద్యా కోర్సు అధ్యాపకురాలు అమల పర్యవేక్షణలో విద్యార్థులు శ్రీ సిటీలోని అపోలో టైర్స్ తయారీ పరిశ్రమను సందర్శించారు. ఈ సందర్భంగా టైర్ల తయారీ విధానం, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రక్రియ, పరిశ్రమలోని వివిధ విభాగాల పనితీరును విద్యార్థులకు వివరించారు.
అనంతరం గోకుల కృష్ణ ఇంజనీరింగ్ కళాశాలను సందర్శించిన విద్యార్థులకు అక్కడ నిర్వహిస్తున్న వివిధ కోర్సులు, టెక్నికల్ ల్యాబ్స్, ఎలక్ట్రానిక్ ల్యాబ్స్, కమ్యూనికేషన్ ల్యాబ్స్‌తో పాటు ఇంజనీరింగ్ విద్యార్థులు నిర్వహించిన వర్క్‌షాప్‌లను చూపించారు.
పరిశ్రమలు, ఇంజనీరింగ్ విద్యా విధానాలపై ప్రత్యక్ష అవగాహన కల్పించేందుకు ఈ ఇండస్ట్రియల్ విజిట్ ఎంతగానో ఉపయోగపడిందని ఉపాధ్యాయులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీసీ గురుకుల పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.