బీసీ గురుకుల విద్యార్థుల ఇండస్ట్రియల్ విజిట్

సత్య వెలుగు న్యూస్ : దొరవారిసత్రం తిరుపతి జిల్లా దొరవారిసత్రం మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల పాఠశాలలో వృత్తి విద్యా కోర్సులు చదువుతున్న విద్యార్థులకు బుధవారం ఇండస్ట్రియల్ విజిట్ నిర్వహించారు. ప్రిన్సిపాల్ తిరుపతయ్య సూచనల మేరకు, వృత్తి విద్యా కోర్సు అధ్యాపకురాలు అమల పర్యవేక్షణలో విద్యార్థులు శ్రీ సిటీలోని అపోలో టైర్స్ తయారీ పరిశ్రమను సందర్శించారు. ఈ సందర్భంగా టైర్ల తయారీ విధానం, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రక్రియ, పరిశ్రమలోని వివిధ విభాగాల పనితీరును విద్యార్థులకు వివరించారు. అనంతరం గోకుల కృష్ణ ఇంజనీరింగ్...