చౌడేపల్లిలో వినూత్నంగా ‘అంగన్వాడీ ఉత్సవం’
చౌడేపల్లి, సెప్టెంబర్ 25 (సత్య వెలుగు న్యూస్): స్థానిక 4వ అంగన్వాడీ కేంద్రంలో కేంద్రం ద్వారా అందుతున్న సేవలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ‘అంగన్వాడీ ఉత్సవం’ నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అందుతున్న పౌష్టికాహారం, పాలు, గుడ్లు, బియ్యం, బాలామృతం తదితర పోషకాహార పదార్థాల పంపిణీపై వివరించారు. 3–6 ఏళ్ల పిల్లలకు ప్రీ-స్కూల్ విద్యతో పాటు రోజువారీ వేడి భోజనం అందిస్తున్నట్లు తెలిపారు. అంగన్వాడీ కేంద్రంలో పిల్లల ఆరోగ్య పరీక్షలు, టీకాలు, బరువు–ఎత్తు నమోదు, అభివృద్ధి స్క్రీనింగ్...