sathyavelugu.com
Date of Publish : 08 September 2026, 11:20 am Posted by : KUMPATI SURESH

అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం.. సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు

హైదరాబాద్: అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా అక్షరాస్యత కోసం కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

అక్షరాస్యత ప్రతి ఒక్కరి ప్రాథమిక హక్కు అని, ప్రతి బిడ్డకు నాణ్యమైన విద్య అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని సీఎం పేర్కొన్నారు. “ఒక అక్షరం జీవితాన్ని మార్చగలదు.. ఒక్క చదువుకున్న వ్యక్తి ఒక తరాన్ని మార్చగలడు” అని అన్నారు.

అక్షరాస్యతను ఉద్యమంగా ముందుకు తీసుకెళ్లి, విద్యావంతమైన, సమానత్వంతో కూడిన సమాజ నిర్మాణానికి అందరూ కృషి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.