చౌడేపల్లి, సెప్టెంబర్ 17 (సత్య వెలుగు న్యూస్): చౌడేపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఖాళీగా ఉన్న హిందీ గెస్ట్ లెక్చరర్ పోస్టు భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ ఎం. జయప్రకాష్ తెలిపారు.
ఎం.ఏ. (హిందీ)లో 50 శాతానికి పైగా మార్కులు సాధించిన అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు. సెప్టెంబర్ 18న ఉదయం 10 గంటలకు ప్రభుత్వ జూనియర్ కళాశాల, చౌడేపల్లిలో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అభ్యర్థులు విద్యా అర్హతల ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు ఒక సెట్ జిరాక్స్ కాపీలను తీసుకుని నిర్ణీత సమయానికి హాజరు కావాలని ప్రిన్సిపాల్ కోరారు.